జనసేన పార్టీ 34 మందితో రాష్ట్ర నూతన కమిటీని నియమించింది. బుధవారం కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ప్రధాన కార్యదర్శులతో పాటు 17 మంది కార్యదర్శులు, 13 మంది సంయుక్త కార్యదర్శుల పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీలోని ఆరు అనుబంధ విభాగాలకు చైర్మన్లను కూడా నియమించారు. తొమ్మిది జిల్లాలకు కొత్తగా పార్టీ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు.జనసేన కమిటీల్లో సింహభాగం యువతకు... మహిళలకే ఇదిలావుండగా.. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పలు సంఘాల నేతలు పవన్‌కల్యాణ్‌ను కలిసినట్టు ఆ పార్టీ వేర్వేరు ప్రకటనల ద్వారా తెలిపింది. పలువురు నిరుద్యోగ యువకులతో పాటు సీఎం నివాసిత ప్రాంతంలోని నిర్వాసితులు, భవన నిర్మాణ కార్మిక సంఘ ప్రతినిధులు, రాజధాని ప్రాంత రైతులు, పలువురు స్టాఫ్ నర్సులు, పారా
మెడికల్ సిబ్బంది ఆయనను కలిసినట్టు పేర్కొంది.
0 Comments